నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని మాదాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ల పరిధిలోని వినాయక మండపాలను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సందర్శించారు. మాదాపూర్ సాయి నగర్ దుర్గా మాత ఆలయం వద్ద సాయి నగర్ యూత్ అసోసియేషన్, తారానగర్ తుల్జా భవాని ఆలయం వద్ద యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయకుని మండపాల్లో వినాయక విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ నాయకులు ఏ.కే బాలరాజు, రాజు ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, నాయకులు జనార్ధన్ గౌడ్, సహదేవ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, బండి పాండు ముదిరాజ్, రాఘవ రెడ్డి, గణపతి, సాంబయ్య, ఫణి కుమార్, హీరా లాలూ, సాయి నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ, గోపాల్, ప్రేమ కుమార్ యాదవ్, శివనాయక్, శ్రీను, బసవరాజ, విష్ణు, జైపాల్, ప్రశాంత్, బిక్షపతి యాదవ్, డి.శ్రీను, అభినందన, రాజు, బండి ప్రసాద్ ముదిరాజ్, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.