రూ. 97 లక్షలతో యూజీడీ పనులకు ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందుకు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు కాలనీ లలో రూ.97 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. యూజీడీ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించేలా చూడాలని, త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నానాక్ రాం గూడ లో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో, గోపన్ పల్లి లో రూ. 47 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పైపులైన్ పనులతో సమస్య తీరనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్ , గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, శ్రీను పటేల్ , సురేందర్, మల్లేష్, జంగయ్య యాదవ్, జగదీష్, రమేష్ , వినోద్, జగదీష్,రాజు , రామారావు, కృష్ణ, సల్లావుద్దీన్, వెంకటేష్, అనిల్, రామేశ్వరమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో యూజీడీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here