హ‌ఫీజ్‌పేట్ ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి బిఎల్‌వై చారిట‌బుల్‌ ట్ర‌స్టు చేయూత‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌లోని ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి బిఎల్‌వై చారిట‌బుల్ ట్ర‌స్ట్ చేయూత‌నందించింది. ట్రస్టు కార్య‌దర్శి, హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ బిజెపి ఇన్చార్జీ బోయిని అనూష మ‌హేష్ యాద‌వ్ హాస్పిట‌ల్ సిబ్బందికి ఎన్‌-95 మాస్కులు, హ్యాండ్ గ్లౌజ్‌లు, శానిటైజ‌ర్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య‌కేంద్రం వైద్యాధికారి డాక్ట‌ర్ విన‌య్‌బాబు మాట్లాడుతూ క‌రోనా ఉదృతి కొన‌సాగుతున్న నేటి ప‌రిస్థితుల్లో వైద్య సిబ్బంది అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తుంద‌ని, ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ స‌హ‌కారంతో పాటు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, స్థానికుల చేయూత, తోడ్పాటు ఎంతో అవ‌స‌రం అని అన్నారు. త‌మ సిబ్బంది ర‌క్ష‌ణ కోసం స‌హ‌క‌రించిన‌ బీఎల్‌వై చారిట‌బుల్ ట్ర‌స్ట్ ప్ర‌తినిధుల‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి బీసీ మోర్చ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు బోయిని మ‌హేష్ యాద‌వ్‌, మెడికల్ ఆఫీసర్ రవీందర్, ట్ర‌స్టు ప్ర‌తినిధులు బోయిని మల్లేష్ యాదవ్, మంజుల, భవాని, కవిత ,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

డాక్ట‌ర్ విన‌య్‌బాబుకు మాస్కులు, హ్యాండ్ గ్లౌజ్‌లు, శానిటైజ‌ర్ అంద‌జేస్తున్న బోయిని అనూష మ‌హేష్ యాద‌వ్ దంప‌తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here