శేరిలింగంపల్లిలో ఘనంగా దసరా వేడుకలు

  • వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
  • శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు
  • రావణ దహనం, ఆకట్టుకున్న బాణసంచా
  • భారీగా తరలివచ్చిన ప్రజలు

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప్ర‌జ‌లు ద‌స‌రా పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వాల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జమ్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ‌మీ వృక్షానికి పూజ‌లు నిర్వ‌హిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

అనంతరం ఒకరికొకరు జమ్మి పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా రామాలయం ఆవరణలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. రావణ దహనం కార్యక్రమాన్ని కార్పొరేటర్ సంప్రదాయబద్ధంగా నిర్వహించి రావణాసురుడిని దహనం చేశారు. ఈ సందర్బంగా హాజ‌రైన‌ భక్తులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం MIG లోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ హాజ‌రై యువతలో జోష్ నింపారు.

రావ‌ణ ద‌హ‌నం చేస్తున్న నాగేంద‌ర్ యాద‌వ్

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. కష్టాల కడలి నుంచి విజయానికి నాంది పలికే పండుగే విజయదశమి అని అన్నారు. మనం పూజించే ప్రతి దేవుడు విజయం సాధించిన రోజు విజయదశమని అన్నారు. మనందరి జీవితాల్లో విజయాలు రావాలని, ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, భక్తులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here