- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ లో పూర్తి చేసిన 138 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ తెరాస సీనియర్ నాయకులు మిర్యాల రాఘవ రావు, మిర్యాల ప్రీతమ్ లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ తమ ఓట్లను, తమ కుటుంబ సభ్యుల ఓట్లను నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి కార్యకర్త అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. ఈ ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6 వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, సునీత ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.





