గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లకు చెందిన మహిళలు సుజాత, మంజులలకు హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా సోమవారం కుట్టు మెషిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. పేదలకు సహాయం అందించడం కోసం హోప్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. హోప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్నారు. సమాజంలోని పేదలకు ఇలాగే సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, సునీత ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు మిర్యాల రాఘవ రావు, బ్రిక్ శ్రీను, బాలరాజు, మిర్యాల ప్రీతం పాల్గొన్నారు.






