నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో నూతనంగా కదంబాస్ సైకియాట్రీ, డీ అడిక్షన్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు. గురువారం జరిగిని హాస్పిటల్ ప్రారంభోత్సవంలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి, నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ రేఖ యాదగిరిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తన డివిజన్‌లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రస్థుతం ఇలాంటి సెంటర్ల అవసరం ఎంతో ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు మోహన్ ముదిరాజ్, హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు.






