గోకుల్‌ప్లాట్స్‌ నాయీ బ్ర‌హ్మ‌ణుల‌కు ఎంఎస్ఎంట ట్ర‌స్టు చేయూత‌… నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేసిన ర‌వికుమార్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ డివిజ‌న్ గోకుల్‌ప్లాట్స్‌లోని నాయి బ్ర‌హ్మ‌ణుల‌కు, నిరుపేద‌ల‌కు మార‌బోయిన సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చేయూత‌ను అందించింది. ట్రస్టు కార్య‌ద‌ర్శి, బిజెపి రాష్ట్ర నాయ‌కులు ఎం.ర‌వికుమార్ యాద‌వ్ మంగ‌ళ‌వారం స్థానిక నాయి బ్రాహ్మణులకు, ఇత‌ర నిరుపేద కుటుంబాల‌కు పెద్ద‌మొత్తంలో నిత్యావసర సరుకులను అంద‌జేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో నాయి బ్రాహ్మణులకు పని లేక చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ తెరాస ప్రభుత్వం వారికీ ఎలాంటి సహాయం చేయలేదని దుమ్మెత్తి పోశారు. ఉపాధి కోల్పోయిన‌ నాయి బ్రాహ్మణులకు నెలకు రూ.5000 /- భృతి అందించాలని డిమాండ్ చేసారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్నా తాను అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్ గారు, నాయ‌కులు బాల కుమార్, మధన చారీ, రఘు, నాగరాజు, నరేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నాయి బ్రాహ్మ‌ణుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అంద‌జేస్తున్న ర‌వికుమార్ యాద‌వ్‌, రాధ‌కృష్ణ యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here