ఇజ్జ‌త్‌న‌గ‌ర్ శ్మ‌శాన వాటిక స్థ‌లాన్ని కాపాడండి… డిప్యూటీ త‌హ‌సిల్ధార్‌కు సీపీఐ నేత‌ల విన‌తి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఇజ్జత్‌న‌గ‌ర్ వీక‌ర్ సెక్ష‌న్‌లోని శ్మ‌శాన‌ వాటిక స్థ‌లాన్ని కాపాడాల‌ని కోరుతూ సీపీఐ నాయ‌కులు శేరిలింగంప‌ల్లి డిప్యూటీ త‌హ‌సీల్ధార్ శంక‌ర్‌కు విన‌తీ ప‌త్రం అంద‌జేశారు. ఇజ్జత్ వీక‌ర్ సెక్ష‌న్ కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి పది వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయ‌ని, ఖాన‌మెట్‌ సర్వే నెంబర్ 41/14 లోని 5 ఎకరాల స్థలంను స్మశాన వాటికగా ఉప‌యోగించుకుంటున్నార‌ని అన్నారు. ఐతే ప్ర‌స్తుతం రెండున్న‌ర ఎక‌రాల స్థ‌లం మాత్ర‌మే మిగిలింద‌ని, ఐతే ఆ స్థ‌లాన్ని సైతం వేలానికి పెట్టిన‌ట్టు టీఎస్ఐఐసీ వారు పేర్కొన‌డం బాద‌క‌ర‌మ‌ని అన్నారు. స్మశాన వాటిక స్థలం చుట్టూ జెండాలు నాటి వేలం వేయుటకు నోటిఫికేషన్ జారీ చేయ‌డాన్ని వారు ఖండించారు. స్మశాన వాటిక స్థలాన్ని వదిలి వేలం వేసుకోవలసిందిగా కోరారు. విన‌తీ ప‌త్రం స‌మ‌ర్పించిన వారిలో సీపీఐ శేరిలింగంప‌ల్లి సంయుక్త కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కన్యగారి నర్సింహారెడ్డి, కే చందు యాదవ్, ఖానామెట్ స‌హాయ కార్యదర్శి రవి కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

డిప్యూటీ త‌హ‌సిల్ధార్ శంక‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న సీపీఐ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here