- రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 3 మాసాలు ముందుగా ఎన్నికలు జరుపుకోవచ్చని అన్నారు. గతంలో ఉన్న డివిజన్లతోనే ఎన్నికల నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 7వ తేదీన డ్రాఫ్ట్ ఫోటో ఓటరు జాబితా విడుదల చేస్తామని, నవంబర్ 8 నుంచి 11 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని తెలిపారు. నవంబర్ 9వ తేదీన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్10వ తేదీన జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నవంబర్ 12న రాజకీయ పక్షాల అభ్యంతరాలను పరిశీలిస్తామని తెలిపారు. నవంబర్ 13న ఫోటో ఓటరు తుది జాబితాను విడుదల చేస్తామన్నారు.






