జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బిజెపి కార్పొరేటర్ల ధర్నా : కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్పొరేటర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గత పది నెలల్లో ఒక్కసారి కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. డివిజన్లలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుండి రోజు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని తెలిపారు. నిధులు విడుదల లేక మధ్యలోనే కాంట్రాక్టర్లు పనులను ఆపేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే నిధులు విడుదలవక అప్పులపాలై ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు, అధికారులు గుర్తించే పరిస్థితి లేదన్నారు. మరుగుదొడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు చూసుకునే వర్కర్లుగా బిజెపి కార్పొరేటర్‌ల పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోతే నిరంతరంగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని బిజెపి కార్పొరేటర్లు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు సునీత ప్రకాష్ గౌడ్, సుప్రియ గౌడ్, రవి చారీ, వినయ్ కుమార్, రాంచన శ్రీ, సరళ, సుచరిత, దీపికా, అరుణ, భాగ్యలక్ష్మి బొక్క, అలె భాగ్యలక్ష్మి, జంగం శ్వేతా, వెంకటేష్, లక్ష్మి గౌడ్, ఉమా రాణి, అమృత, వెంకట్ రెడ్డి, శంకర్ యాదవ్, లాల్ సింగ్, శశికళ, బోణీ దర్శన్, కరుణాకర్, స్రావం, సునీత, రాజ్య లక్ష్మి, చంద్ర రెడ్డి, మహేందర్, హరీష్, శ్రీవాణి బండారు, రాధా ధీరజ్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, సంగీత, తోకల శ్రీనివాస్ రెడ్డి, అర్చన, రంగ నర్సింహా గుప్తా, వంగ మధుసూదన్ రెడ్డి, ప్రేమ్ మహేష్ రెడ్డి, సుజాత, కళ్లెం నవజీవం రెడ్డి, పవన్ కుమార్ ముదిరాజ్, కొప్పుల నర్సింహా రెడ్డి, చింతల అరుణ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా‌ చేస్తున్న బిజెపి‌ కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here