నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ఆద్వర్యంలో గోపన్‌పల్లిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర్‌రెడ్డితో పాటు స్థానిక బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్‌కు పూలమొక్కలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంనంతరం గోపన్‌పల్లి కమ్యూనిటీహాల్, బస్తీదవఖానాలలో మొక్కలు నాటారు. అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌస్‌లు, శానిటైజర్లతో కూడిన సెఫ్టీకిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్, గంగాధర్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు శానిటైజర్, మాస్క్ ధరించాలని, లాక్ డౌన్ నేపథ్యంలో అనవసరంగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి కరోనాకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.