ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాంకు నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: బిహెచ్ఈఎల్ లోని ఎం ఐ జి కాలనీలో గల ఎస్ఓఎస్ పిల్లల అనాధ శరణాలయం లో భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం వర్ధంతి ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం అణు రంగంలో భారతదేశం కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన గొప్ప క్షిపణి శాస్త్రవేత్త అని అన్నారు. విద్యార్థులు ఆయన కలలను సాకారం చేయాలన్నారు. దేశానికి 11 వ రాష్ట్రపతి గా కలాం చేసిన విశిష్ట సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పద్మారావు , జనార్దన్ , రజని , వాణి సాంబశివరావు , ఉమావతి, ఆశ్రమ నిర్వాహకులు వికాస్ తదితరులు పాల్గొన్నారు.

అనాథ ఆశ్రమంలో పిల్లలతో కలిసి అబ్దుల్‌ కలాం వర్థంతిని నిర్వహిస్తున్న రామస్వామి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here