ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్ మెంట్ ఫేస్ 1 కమ్యూనిటీ హాల్ లో అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, బిపి, షుగర్, పల్స్, కంటి, దంత పరీక్షలతో పాటు ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులతో వ్యాధులకు గురవుతున్నారన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరు 40 నిమిషాల పాటు నిత్య వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానం, నడక కొనసాగించాలని అన్నారు. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు ,తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోియేషన్ నాయకులు ప్రవీణ్ గౌడ్, శివరామ్ రాథోడ్, జయప్రకాష్, గురుప్రసాద్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వర రాజు, కొక్కుల జనార్దన్, రామారావు, హాస్పిటల్ ప్రతినిధి అజిత్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here