నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజ పరంపర స్వీట్ షాప్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఇక్కడి ప్రాంత ప్రజల కోసం నాణ్యమైన స్వీట్లను అందజేసేందుకు పరంపర స్వీట్ షాప్ ను ఏర్పాటు చేసిన సుప్రజ పరంపర స్వీట్ షాప్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ ను ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సుప్రజ పరంపర నిర్వాహకులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్, అప్పారావు, ప్రభాకర్, కుమార్, పితాని లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.