హ‌ఫీజ్‌పేట్‌లో డ్వాక్రా మహిళలకు ఉచిత చీరల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలలో భాగంగా హ‌ఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని డ్వాక్రా పొదుపు సంఘాల మహిళా సభ్యులకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీఓ రుక్మిణి, అధ్యక్షురాలు అమరావతి, ఆర్‌పీ పుష్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు సాగేందుకు ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళల అభ్యున్నతితోపాటు స్థానిక కాలనీల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఉచితంగా నాణ్యమైన చీరలు అందుకోవడం పట్ల డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, బాలింగ్ గౌతమ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, ఎస్.కే. జమీర్, సయ్యద్ సాదిక్, సయ్యద్ అసద్, అంజద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here