- కాలిపోయిన గృహోపకరణాలు
- బాధితులకు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పరామర్శ
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్ నగర్ బస్తీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో టీవీ, ఫ్రిజ్ తదితర ఉపకరణాలు కాలిపోయాయి. అలాగే ఇల్లు కూడా 75 శాతం వరకు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ నవత రెడ్డి బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాత్రి ఇంటి ఓనర్స్ లేకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. రాత్రి 10 గంటలకు ఇంట్లో మంటలు చెలరేగటంతో పక్కన ఉన్న ఇళ్ల వారు ఇంటి ఓనర్ కి సమాచారం అందించడంతో ఇంటి ఓనర్ వెంటనే ఎలక్ట్రిక్ డిపార్టుమెంట్ లైన్ మెన్ కి ఫోన్ చేశాడన్నారు. దీంతో సిబ్బంది అప్రమత్తం అయి భారీ నష్టం సంభవించకుండా చూశారన్నారు. విద్యుత్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి విద్యుత్ సరఫరాను ఆపివేశారని, లేదంటే పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండేదన్నారు. సకాలంలో స్పందించిన విద్యుత్ సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బాధితులకు కలిగిన నష్టం వివరాలను ఆమె ఆరా తీశారు.






