మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీఎన్ నగర్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కాలనీ వాసులందరూ కలిసి సమిష్టిగా కమ్యూనిటీ హాల్‌ను నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ప్రజల సహకారం ఉంటే అద్భుతాలు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు పద్మారావు, చింత కింది రవీందర్, కాలనీ ప్రెసిడెంట్ అన్నే రాజు, జనరల్ సెక్రటరీ రాఘవ రావు, వైస్ ప్రెసిడెంట్ రామాంజనేయ రెడ్డి, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.







