శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడలో ఉన్న శ్మశాన వాటికను మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, రవీందర్ ముదిరాజ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కొత్తగూడ శ్మశాన వాటిక ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ ను నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






