ఎంఐజీ కాలనీలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

భారతీనగర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ లో డివిజన్ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హన్మంత రావు, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్, తొంట అంజయ్య యాదవ్ ల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఎంఐజీ కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. కాలనీలో మంచి నీటి వసతికి విశేష కృషి చేస్తున్నామని తెలిపారు. కాలనీలో సుమారుగా రూ.5 కోట్లతో మంచి నీటి పైప్ లైన్ కు ప్రతిపాదనలు పంపడం జరిగింద‌ని అన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, చిత్రంలో మంత్రి హ‌రీష్ రావు

గతంలో సిమెంట్ పైప్ లైన్ ఉండడం వల్ల కలుషిత మంచి నీరు వ‌చ్చేద‌ని, దీంతో పైప్ లైన్ పునరుద్ధరణకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగింద‌ని తెలిపారు. కాలనీ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ, భెల్‌ కల్వర్ట్ పనుల కోసం మరో రూ.3.50 కోట‌లు మంజూరు అయ్యాయ‌ని, త్వరలోనే అన్ని పనుల‌ను పూర్తి చేస్తామ‌ని తెలిపారు. భెల్‌ ప్రధాన గేట్ కూడలి వద్ద జాతీయ రహదారిపై ఉన్న‌ కల్వర్ట్ చిన్నది అవ్వడం వల్ల‌ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంద‌ని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రహిత ర‌హ‌దారి కోసం కొత్త వంతెన నిర్మిస్తామని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, దీని ద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంద‌ని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో నగేశ్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, జలమండలి డైరక్టర్ కృష్ణ, టౌన్ ప్లానింగ్ అధికారి తులసి రామ్, డబుల్ బెడ్రూం అధికారి సురేశ్, తహసీల్దార్ శివ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here