చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో రూ.2.5 లక్షల కమ్యూనిటీ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం ఉంటే నేరాలను అదుపు చేయడం సులువు అవుతుందని అన్నారు. బస్తీలు, కాలనీలు, గెటెడ్ కమ్యూనిటీల సంక్షేమ సంఘాలు ముందుకు వచ్చి సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన దొంగతనాలను నియంత్రించవచ్చని అన్నారు. ఈ క్రమంలో అడుగు ముందుకు వేసిన డాక్టర్స్ కాలనీ వాసులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఎసిపి కృష్ణ ప్రసాద్, డిఐ నర్సింగ్ రావు, ఎస్ ఐ వెంకటేష్, డాక్టర్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






