
కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని 8వ పోలీస్ బెటాలియన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హామీ ఇచ్చారు. శనివారం బెటాలియన్ లో స్థానిక అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ రోడ్లు తదితర సమస్యలను గాంధీ దృష్టికి తీసుకు వచ్చారు. సమస్యల పై స్పందించిన గాంధీ మాట్లాడుతూ బెటాలియన్ లో నివసించే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సిబ్బందికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ పి. మురళి కృష్ణ, అడిషనల్ కమాండెంట్ గంగరాం , ఇన్స్పెక్టర్ దేవేందర్, ఇన్స్పెక్టర్ తిరుపతి అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ, తెరాస నాయకులు బాల కృష్ణ యాదవ్, రాజేష్ యాదవ్, లక్ష్మా రెడ్డి, ప్రసాద్ కిరణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు





