శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పేద మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పేద మహిళలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ఆదివారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేదలకు హోప్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగి ఉండడం గొప్ప విషయమని అన్నారు. కొండా విజయ్ కుమార్ లాగే పేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. పేదలకు సేవ అందించే స్వచ్ఛంద సంస్థలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ లభిస్తాయని అన్నారు.






