శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో నిరాశ్రయులుగా మిగిలిన వరద బాధిత కుటుంబాలకు తన వంతు సహాయంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రవీందర్ యాదవ్ మంగళవారం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గత వందేండ్ల చరిత్రలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైందని, ఇందు వల్ల సంభవించిన వరదలతో నగరంలోని అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

వరద బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు. వరద బాధితులకు తక్షణ సహాయ చర్యల్లో భాగంగా రేషన్ కిట్లను అందజేస్తున్నారని, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇతర తక్షణ సహాయాలు, వరద పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ విపత్కర సమయంలో వరద సహాయక చర్యల్లో పాల్గొని వరద బాధితులకు అండగా నిలవాలని రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. అలాగే ముంపు ప్రాంతాల్లో ఇల్లు కూలిపోయిన వారికి రూ.1 లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకి రూ.50వేల సహాయం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వరద ప్రాంతంలోని కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ఈ సహాయం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.






