క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కుల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, మే 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల‌ ద్వారా మంజూరైన రూ.71,08,236 ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. కూకట్ ప‌ల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్‌ప‌ల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చెక్కుల రూపేణా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, నాయకులు సంజీవ రెడ్డి, ప్రసాద్, దొడ్ల రామకృష్ణ గౌడ్, శ్రీధర్ రెడ్డి, అష్రాఫ్, బాలనర్సయ్య, అక్కిరెడ్డి, నిఖిల్, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here