శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): బేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో నేతాజీ నగర్ కాలనీలో 10వ తరగతిలో ఉత్తీర్ణత, మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ 10వ తరగతిలో మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. బాగా చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ నుంచి ఉన్నత పదవులు సాధించాలని ఆపై ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు.
భేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ ప్రతి ఏటా అందించడం జరుగుతుందని, విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించాలని, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, భీమ్రావు నాయక్, బేరి సంధ్య యాదవ్, బి సంజన, బి నరేష్ నాయక్, సహస్ర, రమేష్ గుప్తా, రమ్య, వర్షిత, శీను రాజేశ్వరి, నేహా, ఖలీల్ ఫర్జానా, సాయి చరణ్, భీమ్రావు నాయక్, యశోద తదితరులు పాల్గొన్నారు.