నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కష్ట కాలంలో పేదలకు విశిష్ట సేవలందించిన గుడ్ల ధనలక్ష్మీ ట్రస్ట్ ఛైర్మన్ గుడ్ల ధనలక్ష్మీని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ అభినందించారు. గుడ్ల ధనలక్ష్మి మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కోవిడ్ సమయంలో ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఆమెతో పాటు ట్రస్ట్ గౌరవ సభ్యులు పార్వతి ఉన్నారు.