ద‌ళిత బ‌హుజ‌న పార్టీ శేరిలింగంప‌ల్లి ఇన్చార్జ్‌గా ప‌ల్లపు చంద్ర‌మౌళి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ద‌ళిత బ‌హుజ‌న పార్టీ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇన్చార్జీగా గోప‌న్‌ప‌ల్లి గ్రామానికి చెందిన ప‌ల్ల‌పు చంద్ర‌మౌళి నియ‌మితుల‌య్యారు. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు వ‌డ్ల‌మూరి కృష్ణ స్వ‌రూప్ చంద్ర‌మౌళికి నియామ‌క ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌మౌళి మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి భాద్య‌త‌లు అప్ప‌గించినందుకు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు వ‌డ్ల‌మూరి కృష్ణ స్వ‌రూప్‌కు, రాష్ట్ర అధ్య‌క్షుడు వేద‌వ్ర‌త్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చేపూరీ రాజు, గ్రేట‌ర్ అధ్య‌క్షుడు మ‌ద్దేల ప్ర‌వీన్ కుమార్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ అర్ష‌ల రాజు, జిల్ల నాయ‌క‌త్వానికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గౌత‌మ బుద్దుడు, అంబేద్క‌ర్‌, పూలేల‌ను ఆద‌ర్శంగా తీసుకుని శేరిలింగంప‌ల్లి నియోజక‌వ‌ర్గంలో బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి కృషి చేస్తాన‌ని అన్నారు.ప్ర‌జా స‌మ‌స్య‌ల పోరాటంలో ముందుటాన‌ని అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత బహుజ‌న పార్టీ అభ్యున్న‌తికి కృషి చేస్తాన‌ని అన్నారు.

ప‌ల్ల‌పు చంద్ర‌మౌళికి నియామ‌క ప‌త్రం అంద‌జేస్తున్న ద‌ళిత బ‌హుజ‌న పార్టీ జాతీయ అధ్య‌క్షుడు వ‌డ్ల‌మూరి కృష్ణ స్వ‌రూప్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here