శేరిలింగంప‌ల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను వెంట‌నే అర్హుల‌కు కేటాయించాలి: బుచ్చి రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: నియోజకవర్గ పరిధిలో నిర్మించిన‌ డ‌బుల్ బెడ్ ఇండ్ల‌ను వెంట‌నే అర్హులైన నిరుపేద‌ల‌కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రంగారెడ్డి అర్భ‌న్‌ జిల్లా ఉపాధ్య‌క్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్ శేరిలింగంప‌ల్లి జోన‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ మ‌ల్లారెడ్డికి మంగ‌ళ‌వారం విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ గుల్‌మోహ‌ర్‌ పార్క్(నల్లగండ్ల)లో నిర్మాణం చేసిన డబుల్ బెడ్ ఇండ్ల‌ను గ‌తేడాది బిజెపి నేత‌లు సందర్శించి సంబంధిత అధికారుల‌పై ఒత్త‌డి తేడా ప‌నులు పూర్తి చేసి రెండు నెలలలో అర్హులైన వారికి ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చార‌ని, ఐతే ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణచేయలేదని మండి ప‌డ్డారు. అదేవిధంగా హఫీజ్‌పేట్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ నిర్మాణం చేసి సంవత్సరాలు గడుస్తున్న, ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని, నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయ‌ని ద్వ‌జ‌మెత్తారు. టీ.అర్.ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నా అర్హులకు డబుల్ బెడ్ ఇండ్ల‌ను కేటాయించకుండా జాప్యం చేస్తుందని మండిప‌డ్డారు. ఇప్పటికైనా సమయం వృధాచేయకుండా లబ్ధిదారులను గుర్తించి వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని, లేనిపక్షంలో బిజెపి తరుపున ఉద్యమించి బడుగు, బలహీనవర్గాలకు మద్దతుగా నిలుస్తామని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా కోశాధికారి రమేష్ సోమిసెట్టి, ఓ.బీ.సి మోర్చా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, ఆంజనేయులు, శ్రీధర్, రాంరెడ్డి, బీ.జే.వై.ఎం నాయకులు హరి కృష్ణ, కుమ్మరి జితేందర్, నీరటి చంద్ర మోహన్, సిద్దు, పి. సాయి, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, సత్య కుర్మా, శ్రీనివాస్ చారి, దయాకర్, లక్ష్మణ్ ముదిరాజ్, మహిళ నాయకులు భీమాని విజయ లక్ష్మి, రజనీ, కౌసల్య, అరుణ కుమారి, స్వాతి సిరి, కుమార్ యాదవ్, భీమాని సత్య నారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జాయింట్ క‌మిష‌న‌ర్ మ‌ల్లారెడ్డికి విన‌తీ ప‌త్రం అంద‌జేస్తున్న బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here