మియాపూర్ పీజేఆర్ స్టేడియంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లోని పీజేఆర్ స్టేడియంలో సాయంత్రం వాకర్స్‌ కోసం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది పాల్గొనగా, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, ఓటీపీ మోసాలు, గుర్తుతెలియని మొబైల్ యాప్స్, మోసపూరిత వీడియో కాల్స్ తదితర ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వివిధ మోసపూరిత పద్ధతులను వివరిస్తూ, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, ఎవరికీ ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు వెల్లడించకూడదని, గుర్తుతెలియని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ CMC డివిజన్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చందానగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఏ. శ్రీధర్ కుమార్ పాల్గొని సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here