శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తన కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, రాజ్యలక్ష్మి, సౌందర్య, అరుణ, మంజుల, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






