నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల పరిధిలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా మౌళిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానికులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. యూజీడీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, రాజేందర్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కంది జ్ఞానేశ్వర్, దేవరాజ్, గోపాల్, వీరేందర్, చిన్న, ఇస్మాయిల్ ఖాన్, యూత్ సభ్యులు మల్లికార్జున్, సంపత్, మహిళలు బీమమ్మ, లక్ష్మీ, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రేమ తదితరులు పాల్గొన్నారు.