శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలంతా రంగు రంగుల బతుకమ్మలతో ఒక్క చోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులు సైతం ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చందానగర్లోని గౌతమీనగర్ కాలనీ ఉత్సవ సమితి, కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.






