నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుని మృతి పట్ల ఏఎంహెచ్ఓ కార్తీక్ సంతాపం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుడు యాదయ్య మృతి దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను చందానగర్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్, ఎస్ ఆర్ పీ, ఎస్ఎఫ్ఏ లు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం నుండి యాదయ్యకు రావలసిన బెనిఫిట్స్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎస్ఆర్ పీలు, ఎస్ఎఫ్ఏలు, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.