శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక నవరాత్రుల సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీ ఏ బ్లాక్, గోపాల్ రెడ్డి నగర్, ఓయూ కాలనీ, రాజా రాజేశ్వరి నగర్ లోని పార్క్ అవెన్యూ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ గణనాథుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని, ప్రతి ఒక్కరు అనుకున్న పనిలో విజయం సాధించాలని, అందరికీ ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి కూడా వినాయక చతుర్థి నవరాత్రుల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు జే. బలరాం యాదవ్, రమేష్ యాదవ్, టీ. వెంకటేష్, మొహ్మద్, నాగరాజు, అశోక్, శ్రీనివాస్, అవదీష్ నారాయణ, హనుమంత్ రెడ్డి, నరసింహ రెడ్డి, యాదిరెడ్డి, గడ్డం ప్రశాంత్, ప్రవీణ్, రిటైర్డ్ జడ్జి గోవింద్ రెడ్డి, రజనీకాంత్, శివారెడ్డి, శ్రీకాంత్, జీ. వెంకటేష్, భక్తులు, ప్రజలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.






