శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల మెయిన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన హోమ్ లేన్ ఇంటీరియర్స్ ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ హోమ్ లేన్ ఇంటీరియర్స్ సంస్థ ఆధునిక డిజైన్లు, నాణ్యమైన మెటీరియల్‌తో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ఇంటీరియర్ సేవలు అందించి అందరి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఇళ్లలో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా కిచెన్, బెడ్రూమ్, లివింగ్ ఏరియా తదితర విభాగాలకు ఆకర్షణీయమైన, ప్రయోజనకరమైన డిజైన్లు రూపొందించడం, సమయపాలనతో పనులను పూర్తిచేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే కస్టమర్ బడ్జెట్‌కు అనుగుణంగా సముచిత ప్లానింగ్ చేసి, దీర్ఘకాలిక మన్నిక కలిగిన ఇంటీరియర్ పనులు అందించడం ద్వారా హోమ్ లేన్ ఇంటీరియర్స్ ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన కార్మికుల సహకారంతో ఈ సంస్థ గచ్చిబౌలి పరిసర ప్రాంత ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సొంతంగా వ్యాపారం చేయడం కాకుండా పదిమందికి ఉపాధి కల్పించడం మంచి పరిణామం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో యువత స్వయం ఉపాధి పొందే మార్గం వైపు రావడం జరుగుతుందన్నారు. తదనంతరం హోమ్ లేన్ ఇంటీరియర్స్ యాజమాన్యం కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నల్లగొండ హుడా ఉపాధ్యక్షుడు రంజిత్ పూరి, సీనియర్ నాయకులు శేఖర్ , సుమన్, ప్రకాశ్, అజయ్ , రమేష్, రాఘవేంద్ర, నర్సింగ్ రావు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





