శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు, సమత నగర్ కాలనీలలో రూ. 1 కోటి 83 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు, సమత నగర్ కాలనీలలో రూ. 1 కోటి 83 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించిందని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






