నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలు లబ్దిపొందుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయశంకర్ కాలనీ లో నివసిస్తున్న మహమ్మద్ రఫీ కి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 96 వేల ఎల్ఓసీ పత్రాన్ని మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, నాయకులు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.