నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మంచి నీటి సరఫరా, యూజీడీ నిర్వహణ పై జలమండలి అధికారులు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సమగ్ర , సంతులిత అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్ లో మౌళికవసతుల కల్పన కోసం ప్రతి డివిజన్ నుండి కొత్తగా 2 కి.మీ ల మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం, 1 కి.మీ యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు తీసుకున్నట్లు చెప్పారు పనులు త్వరిత గతిన చేపట్టాలని, అత్యవసర పనులను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా పనులు గుర్తించి పూర్తి చేయాలన్నారు. జలమండలి అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేలా ఇంజనీరింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని అన్నారు. రోడ్డు కట్టింగ్ సమయంలో మంచి నీటి పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్ వేసేటప్పుడు తవ్విన రోడ్లను వెంటనే మరమత్తులు చేయాలని సూచించారు. వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల వద్ద, మ్యాన్ హోల్స్ పై కప్పులు ఉండేలా చూడాలన్నారు. నాలాల వద్ద కనీస భద్రత చర్యలు పటిష్టంగా చేపట్టాలని, వర్షాకాలంలో మంచీ నీరు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి జీఎణమ రాజశేఖర్, డీజీఎంలు శ్రీమన్నారాయణ, నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్యం ,యాదయ్య, సందీప్,నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సాయి చరిత, సునీత, మానస తదితరులు పాల్గొన్నారు.