ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: డాక్టర్ అభిరామ్ కోగంటి

నమస్తే శేేేేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ భారతి మహిళా మండలి భవనంలో సిటిజన్ హాస్పిటల్ వారి సౌజన్యం తో శనివారం గ్యాస్ ట్రబుల్ (ఎసిడిటీ ) వ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని సిటిజన్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఏంట్రాలజీ వైద్యులు డాక్టర్ అభిరామ్ కోగంటి మాట్లాడుతూ గ్యాస్ ట్రబుల్ (ఎసిడిటీ ) మనం తీసుకొన్న ఆహారం జీర్ణం కాక తద్వారా కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన గ్యాస్ ఏర్పడుతుందని తెలిపారు. కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించటం , ఆకలి లేకపోవడం ,పెద్ద శబ్దాలతో తేన్పులు రావడం, ఛాతీలో మంట , వికారంగా ఉండటం , మలబద్దకం , నోటిలో నీళ్ళు ఊరటం , తలనొప్పి , వాంతులు అవ్వటం, అపాన వాయువు ఎక్కువ వదలడం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే గ్యాస్ ట్రబుల్ గా నిర్ధారించవచ్చు అని అన్నారు. ఈ వ్యాధి నివారణకు అల్కాహాల్ , పొగత్రాగటం , గుట్కా లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి‌ అన్నారు. మానసిక ఆందోళన తగ్గించుకోవాలి అని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్స్ , మసాలాలతో కూడిన ఆహారాలను పూర్తిగా తగ్గించుకోవాలని, ఆహారాన్ని తీసుకోవటం లో పూర్తిగా నమిలి తిని , సమయపాలన పాటించాలని సూచించారు. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ ట్రబుల్ అదుపులో ఉంటుందన్నారు. ఆరోగ్యం పట్ల ఎటువంటి అశ్రద్ధ చేయకుండా వ్యాధి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, సభ్యులు పాలం శ్రీనివాస్ , భారతి మహిళా మండలి నాయకురాళ్లు రాధరాణి ,దేవి , సరళ , స్వయంప్రభ , సిటిజన్ హాస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు అభిరామ్ కోగంటి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here