ఆద‌ర్శ మ‌హిళ‌కు ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హోప్‌ ఆపన్న హ‌స్తం… ఎల‌క్ట్రానిక్ కుట్టు మిష‌న్ అంద‌జేత‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాన‌వ‌తా దృక్ప‌దంతో మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు శిక్ష‌ణ ఇస్తున్న ఓ మ‌హిళ‌కు ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ హోప్ చేయూత‌నందించింది. విజ‌య‌వాడ‌కు చెందిన దుర్గాకుమారి గ‌త ఆరు సంవ‌త్స‌రాలు ఎంతో మంది మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చి వారు స్వంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా ప్రోత్స‌హించింది. దుర్గాకుమారి గొప్ప‌మ‌న‌సును గుర్తించిన ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ హోప్ అధ్యక్షుడు కొండా విజ‌య్‌కుమార్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గాలి కృష్ణ‌లు శ‌నివారం న‌ల్ల‌గండ్ల అప‌ర్ణ స‌రోవ‌ర్ క‌మ్యూనిటీ హాల్‌లో ఆమెకు ఎల‌క్ట్రానిక్ కుట్టు మిష‌న్‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ దుర్గాకుమారీ లాంటి వారిని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని అన్నారు. ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్న ఆమెకు తోచిన స‌హ‌కారం అందించ‌డం ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సాయి తరుణ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

మహిళకు ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ అందజేస్తున్న కొండా విజయ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here