పరిసరాల పరిశుభ్ర‌తను పాటిద్ధాం… వ్యాధులకు దూరంగా ఉందాం: కార్పొరేటర్ మంజులర‌ఘునాథ్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్‌న‌గ‌ర్‌ డివిజ‌న్ ప‌రిధిలోని పట్టణ ప్రగతి రేండోవ రోజు కార్యక్రమంలో భాగంగా శంకర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, భవానిపురం కాలనీలలో కార్పొరేటర్ మంజులర‌ఘునాథ్ రెడ్డి శుక్ర‌వారం పాదయాత్ర నిర్వహించారు. అధికారులు, స్థానికులతో కలిసి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేట‌ర్ మంజులర‌ఘునాథ్ రెడ్డి స్థానికుల‌కు ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతతోనే రోగాలు దరిచేరవని, తప్పనిసరిగా శుభ్రతను పాటిద్దామన్నారు. కేసీఆర్ హరిత తేలంగాణ సాధన కోసం కృషి చేస్తున్నార‌ని వారి ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సుచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ర‌ఘునాథ్ రెడ్డి, ఓర్సు వేంకటేష్‌, అక్బర్ ఖాన్, దాసు, కోండల్ రెడ్డి, యశ్వంత్గా, ఏలమయ్య, సిహెచ్.రమేష్, ప్ర‌విణ్, కోటి, ధనుంజయ్, రఘునందన్ రెడ్డి, సుందరం, కృష్ణా రెడ్డి, శ్రీనివాస్, శ్యామల త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here