ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వైద్య శిబిరంలో పండ్లు పంపిణీ చేస్తున్న డా.ఎస్.వెంకటరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:  డాక్టర్స్ డే  సందర్భంగా ముఖేశ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలగండ్ల హుడా లే ఔట్ లో గల వలస కూలీల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు శిబిరార్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, చిన్నారులకు బిస్కెట్లు, పండ్లు, వాటర్ బాటిళ్లు, మస్కులు పంపిణీ చేశారు. ఉదయం 9 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం. ల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 100 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎస్.వెంకట రెడ్డి,  వైద్యులు శివకుమార్, శివరాజ్, ఆంజనేయులు, చారి, యాదయ్య, అరుణ, శోభ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here