నాణ్యతతో సీసీ రోడ్డును నిర్మించాలి: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని విద్యానగర్ కాలనీలో జీహెచ్ఎంసీ నిధులతో చేప‌ట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొంత కాలంగా విద్యానగర్ కాలనీలో రోడ్లలో గుంతలు ఏర్పడటం వల్ల తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని స్థానిక‌‌ వాహనదారులు విజ్ఞ‌ప్తి చేశార‌ని, అందుక‌నే సీసీ రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని తెలిపారు. రోడ్డు ప‌నుల‌ను నాణ్య‌తా ప్ర‌మాణాలో చేప‌ట్టాల‌న్నారు. ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి కాల‌నీవాసుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నీలకంఠ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.

విద్యాన‌గ‌ర్ కాల‌నీలో కొన‌సాగుతున్న సీసీ రోడ్ల నిర్మాణం
రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here