శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఖాజాగూడలోని గచ్చిబౌలి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను వివరిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో గోడపత్రికలను ప్రదర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రానున్న 10 రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని ఆరోపిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






