శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): గోపీనగర్ కాలనీలో బోనాల పండుగ సందర్భంగా పాండు గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారి ఫలహారం బండి పూజా కార్యక్రమం, ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పాండు గౌడ్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, ఉపాధ్యక్షుడు రాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, సంయుక్త కార్యదర్శి హరికృష్ణ చారి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారికి హారతులు ఇచ్చి ఫలహారం బండిని భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో జీవించాలని, ఒకరి మేలు ఒకరు కోరుకుంటూ అందరి సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించారు. బోనాల పండుగను పురస్కరించుకుని కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాండు గౌడ్, అరవింద్, సుభాష్, శంకర్ కురుమ, రాజు చారి, శేఖర్ గౌడ్, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





