మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో తిరంగా యూత్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో 50 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేశారు. అనంతరం దాతలకు ధ్రువపత్రాలు, పండ్లను అందజేసి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా తాండ్ర కుమార్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని అన్నారు. తలసేమియా వ్యాధితో చాలామంది బాధపడుతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ గొప్ప మనసున్న వారిగా గుర్తింపబడతారని అన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో ఇలా ముందుండి సమాజాన్ని ముందుకు నడపాలని సందేశమిచ్చారు.


ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు కిరణ్ యాదవ్, న్యాయవాది తాండ్ర రమేష్, తిరంగా యూత్ ప్రెసిడెంట్ రోషన్, వైస్ ప్రెసిడెంట్ పల్లె మురళి, జనరల్ సెక్రటరీ కొత్తపల్లి స్వామి, తిరంగా యూత్, విజయ వినాయక యూత్ న్యూ కాలనీ సభ్యులు సాయి యాదవ్, మహేష్, సంగమేశ్వర్, రాంబాబు, బాలాజీ, రాజేష్, రాజశేఖర్, ఆంజనేయులు పాల్గొన్నారు.





