నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ట్రాఫిక్ నివారణకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం సంతోషకరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. షేక్ పేట్ నుండి మల్కం చెరువు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయి ప్రారంభం చేసుకోనున్న దృష్ట్యా భేరి రాంచందర్ యాదవ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలో చాలా సాప్ట్ వేర్ కంపెనీలు ఏర్పడడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైందన్నారు. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతుందన్నారు. అందులో భాగంగా షేక్ పేట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి స్ట్రాటెజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద 2.8 కి.మీ పొడవుతో నిర్మాణం చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య తీరనుందన్నారు. లింగంపల్లి పార్క్, బిహెచ్ఇఎల్ సర్కిల్ చందానగర్ పరిధిలో రద్దీగా ఉన్న ప్రాంతాలలో రవాణా సౌకర్యం మెరుగుపర్చేలా, ఇరుకుగా ఉన్న రహదారులను త్వరగా రోడ్డు వెడల్పు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.