శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం అమలు, బీసిలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, నిధులు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని ఈ దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో పూలే భవన్లో చేపట్టనున్న ఈ దీక్షలో బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోఎర్రగుంట్ల వెంకటేష్ యాదవ్, పల్నాడు వెంకటేష్ యాదవ్, బిల్డర్ రమణ యాదవ్, కృష్ణ గౌడ్, రమేష్ పద్మశాలి నేత, పాములేటి యాదవ్, రాజు ముదిరాజ్, నాయి బ్రాహ్మణ సంఘం కిషోర్, రజక సంఘం కిరణ్ పాల్గొన్నారు.






