శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. భవిష్య ప్రణాళిక సమాలోచనలు, రాబోయే సంస్థాగత స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు అందరూ ఏకమై ఐకమత్యంతో ఎస్సీ ఎస్టీ మైనార్టీల సహకారంతో బహుజన రాజ్యాధికారం సాధించాలని కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. విద్యా ఉద్యోగం ఉపాధి, వైద్యం లక్షలు లక్షల ఖర్చు ఉన్నందున, ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పించాలని, పేదరిక నిర్మూలనలో భాగంగా రోటి కప్‌డా మఖాన్ ఉపాధి ద్వారా కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

కార్యవర్గం సమీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బిసి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బండి రామకృష్ణ గౌడ్ ని నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ కార్యవర్గ సమావేశంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల అధ్యక్షుడు మధు యాదవ్, ప్రధాన కార్యదర్శి బండి రామకృష్ణ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డప్పు కొట్టు హరిబాబు, పాములేటి యాదవ్, సినీ ఆర్టిస్ట్ లక్ష్మీనారాయణ యాదవ్, బీసీ కులాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.





